సినీనటుడు గిరిబాబు మృతి పట్ల మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంతాపం
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
సినీనటుడు గిరిబాబు మృతి పట్ల మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి మాట్లాడుతూ....గిరిబాబు కింది స్థాయి నుంచి స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగి సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్నారు. గిరిబాబు తనవంతుగా సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఎంత ఎదిగిన సొంత ఊరిపై మమకారంతో రావినూతల గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గిరిబాబుకు ప్రకాశం జిల్లాకు విడదీయలేని బంధం ఉందన్నారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రగాఢ సానుభూతి తెలిపారు.