సి మల్లవరంలో గంగమ్మకు విశేష పూజలు
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం శ్రీ మల్లవరం గ్రామంలో గంగమ్మకు విశేషంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి కి వేదమంత్రాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. విశేష అలంకరణలో అమ్మవారికి భక్తులు ద్వీప దూప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.