BREAKING
ఆర్యన్ ఖాన్‌కు రజత్ బేడీ భావోద్వేగ లేఖ నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ శబరిమల భక్తులకు రైల్వే శాఖ తీపికబురు..నేటి నుంచే 54 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు షురూ.. Friday OTT Movies : ఓటీటీలోకి 'రణబాలి'.. ఒక్క రోజే 18కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి! ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా యూరప్‌లో నిరుద్యోగ సమస్యకు చెక్‌..యువతకు ఉపాధి కల్పనపై నిపుణుల విశ్లేషణ Allu Sneha Reddy: అల్లు అర్జున్‌ సతీమణికి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక వేడుకలో కీలక బాధ్యతలు! దక్షిణ కొరియాలో కూపాంగ్ పునరుజ్జీవన ప్రయాణానికి రాజకీయ సెగలు బెల్లంకొండ 'హైందవ' నుంచి మెలొడీ ట్రీట్.. ఆకట్టుకుంటున్న 'ఎవరైనా' లిరికల్ సాంగ్ చైనా షేర్ మార్కెట్ రక్షణ వ్యూహం..మార్కెట్ నిపుణుల హెచ్చరికలు, భవిష్యత్ సవాళ్లు ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. షెన్‌జెన్‌లో డ్రోన్ల ద్వారా వినూత్నంగా ఫుడ్ డెలివరీలు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్.. ఔట్లుక్, టీమ్స్ సేవలకు భారీ అంతరాయం ఏపీలో కొత్తగా రూ.700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ సుముఖత : మంత్రి లోకేష్ తో డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ

ఐచర్ వాహనాల స్టాండ్‌ను తొలగించవద్దు.. మా పొట్ట కొట్టొద్దు.. 20 ఏళ్లుగా 50 కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న స్టాండ్.. మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంత్ రావును కలసి వినతిపత్రం అందజేసిన సాకే హరి..

Select Suryaa Now
ఐచర్ వాహనాల స్టాండ్‌ను తొలగించవద్దు.. మా పొట్ట కొట్టొద్దు..  20 ఏళ్లుగా 50 కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న స్టాండ్..  మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంత్ రావును కలసి వినతిపత్రం అందజేసిన సాకే హరి..

(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరంలో 20 ఏళ్లుగా ఐచర్, బొలెరో వాహనాల స్టాండ్‌ను నమ్ముకొని జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాల పొట్ట కొట్టవద్దని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం మున్సిపల్ కమిషనర్ ఎం. జశ్వంత్ రావును ఆయన కార్యాలయంలో ఐచర్, బొలెరో వాహన యజమానులు, డ్రైవర్లతో కలిసి సాకే హరి కలిశారు. స్టాండ్‌ను తొలగించవద్దని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ.. బళ్లారి రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు మధ్య ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గత 20 ఏళ్లుగా ఐచర్, బొలెరో వాహనాల స్టాండ్ కొనసాగుతోందన్నారు. ఇక్కడ వాహనాలను నిలిపి బాడుగలకు వెళ్తూ సుమారు 50 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు.స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టాండ్‌ను తొలగించి, వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని హెచ్చరించడంతో వాహన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా బాడుగల కోసం స్థిరమైన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ స్టాండ్‌ను తొలగిస్తే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రదేశంలోనే ఐచర్, బొలెరో వాహనాలకు స్టాండ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కొంత భాగాన్ని మాత్రమే స్టాండ్ కోసం కేటాయించాలని గతంలో కలెక్టర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు.
తమకు జీవనాధారంగా ఉన్న స్టాండ్‌ను పూర్తిగా తొలగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, 50 కుటుంబాలకు న్యాయం చేయాలని సాకే హరి అధికారులను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వాహన యజమానులు రామాంజనేయులు, శ్రీనివాసులు, రాజు, హరినాథ్, రామయ్య, ధనుంజయ, రాధాకృష్ణ, షబ్బీర్, రవి నాయక్, కాశీం, గజరాజు, నరసింహారెడ్డి తదితరులతో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు