శ్రీరామ్ చినబాబు గెలుపు చారిత్రాత్మకం : చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీరభాస్కర్
మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) 9629 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం సరికొత్త అధ్యయమని చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీరుభాస్కర్ పేర్కొన్నారు.చైర్మనుగా విజయం సాధించిన అనంతరం మంగళవారం శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఓర్సు వీరభాస్కర్ ఓ సాధారణ చేనేత కుటుంబం నుండి రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీరామ్ చినబాబు అంచలంచెలుగా ఎదిగారన్నారు.తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా తన సామర్థ్యాన్ని ఏపీకి తెలియజేశారన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబుల వద్ద ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.ఆయన సమర్థతను గుర్తించి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం అదే ఊపులో ఘనవిజయం సాధించడం శుభపరిణామమని,మదనపల్లి అభివృద్ధికి ఇది మంచి సంకేతమన్నారు.టిడిపిలో మాస్ లీడర్,తెలుగు యువత రథసారథిగా ఆయన అందరికీ సుపరిచితుడన్నారు.బీసీల అభ్యున్నతి,చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన నిర్విరామ కృషిచేస్తున్నారని కొనియాడారు.ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన మదనపల్లె ప్రజలకు కూటమి నాయకులు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి