andhrapradesh
అద్దంకిలో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్. చైర్‌పర్సన్‌గా కాకాని అశోక్ ఘన విజయం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకిలో కూటమి ప్రభంజనం..
టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్.
చైర్‌పర్సన్‌గా కాకాని అశోక్ ఘన విజయం.
అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీని పూర్తిగా తుడిచిపెట్టేస్తూ అద్దంకి పురపాలక పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గాను ఏకంగా 29 వార్డుల్లో విజయదుందుభి మోగించింది. అద్దంకి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కాకాని అశోక్ 7,493 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు.
తెలుగుదేశం పార్టీ 25 వార్డులకు పోటీ చేయగా మూడు వార్డులు(1,6,32) ఏకగ్రీవం అయ్యాయి, మిగిలిన 22(3,4,5,7,8,9,11,12,13,14,15,16,18,19,20,22,23,24,25,26,29,31) వార్డులలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. నాలుగు వార్డులలో(10,21,27,30) జనసేన విజయం సాధించింది. వైయస్సార్సీపి రెండు(2,28) వార్డులను గెలుచుకోగా స్వతంత్ర అభివృద్ధి ఒక వార్డులో(17) విజయం సాధించారు. చైర్‌పర్సన్‌గా కాకాని అశోక్ విజయం సాధించడంతో పాటు ఏకంగా 29 స్థానాల్లో కూటమి గెలవడంతో అద్దంకి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.