శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ వారి సేవాతత్పరత : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నవితరణ కార్యక్రమం
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాల నందు శనివారం చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఢిల్లీ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆసుపత్రికి వచ్చే రోగులు,వారి సహాయకుల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఢిల్లీ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని,ఆపదలో ఉన్నవారికి,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు అన్నదానం చేయడం ఎంతో తృప్తినిస్తుంది.విద్యార్థులలో కూడా చిన్నప్పటి నుండే ఇలాంటి సేవా భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వందలాది మంది రోగులకు,వారి బంధువులకు ఉపాధ్యాయులు స్వయంగా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సుబ్రహ్మణ్యం,తిలక్ ప్రసాద్,కరణం జనార్ధన్, రవికుమార్,రామమోహన్,మహేంద్రనాథ్ రెడ్డి,నాగార్జున,రమేష్,విజయ్ కుమార్,తిరుమల కుమార్,గోవర్ధన్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయుల సేవానిరతిని ఆసుపత్రి సిబ్బంది,రోగుల బంధువులు ప్రత్యేకంగా అభినందించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి