BREAKING
బతుకమ్మ వేళా.. లక్ష్మాపూర్‌ రింగ్‌ రోడ్డులో చీకట్లే.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం పోలాండ్‌లో వరుస కత్తిపోటు దాడులు రియాద్ విమానాశ్రయం వద్ద భారీ శబ్దంతో పేలుడు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ను తొలగించాలని ఢిల్లీకి తరలిన యూత్ కాంగ్రెస్ అవనిగడ్డలో ఉషశ్రీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం- ఎమ్మెల్యే మండలి శ్రీకాళహస్తి పాలకమండలి సభ్యులకు తటవర్తి రమేష్ ఆత్మీయ ఆతిథ్యం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు మాని.. అందుగుల గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.. రవి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు స్పెయిన్ రాజకీయాల్లో సెంట్రిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రముఖ లాయర్ మిరియం పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఫ్రెషర్స్ సందడి. ముప్పవరంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవ శోభ: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శిరిడీ సాయిబాబా దేవస్థానం. పుతిన్, ట్రంప్ ఫోన్ కాల్...ముందుగా ఫోన్ పెట్టేందుకు ఇద్దరూ ఇష్టపడలేదన్న క్రెమ్లిన్ రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎమ్మెల్యే రోషన్ కుమార్ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన మామిండ్ల ముత్యాలు యాదవ్ మండపం ఆకలితో ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో అన్నదానం.. తాళ్లపల్లి రమేష్ గుప్తా సేవలకు ప్రశంసలు

షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Select Suryaa Now
షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

-చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు

-సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నిరసన

-కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి:

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు శనివారం  గృహనిర్బంధం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి పార్టీలు విజయవాడలో తలపెట్టిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి రాజ్‌భవన్ వరకు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్, వామపక్ష పార్టీల కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ షర్మిల ఇంటి నుంచి బయటకు వస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.