శాంకాంబరీ దేవిక అన్నపూర్ణ దేవి
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో దసరాశరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు మాస దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు శ్రీ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు బాలసుబ్రమణ్యం, రాము ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల కూరగాయలతో అమ్మవారిని శోభాయమానంగా కూష్మాండ దుర్గాదేవిగా అలంకరించారు అనంతరం శ్రీ శాకంబరీ దేవికి మహా మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు రాము శాకంబరీ దేవి విశిష్టతను భక్తులకు వివరించారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా