మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చివరి రోజైన ఆదివారం మదనపల్లిలో నామినేషన్ల ప్రక్రియ జోరు కొనసాగింది.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నాయకులు,డాక్టర్ అప్సర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు.దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత తమ పార్టీదేన్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెరిగిపోయాయని,నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని,దీంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.గత,ప్రస్తుత ప్రభుత్వాలు మదనపల్లి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు.ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించి,తనకు అవకాశం కల్పిస్తే పట్టణాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు.ఏపీలో,దేశంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని 2029 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించడం,తద్వారా రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి