సేవకార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు.మడకశిర జడ్పీటీసీ టికెట్ పై కళ్యాణ్ కుమార్ ఆశలు .
సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు.
- జెడ్పీటీసీ టికెట్పై ఆర్. కళ్యాణ్ కుమార్ ఆశలు!
-జనసేన పార్టీ తరఫున అవకాశం కల్పించాలని కోరుతున్న పార్టీ నాయకులు.
మడకశిర, మేజర్ న్యూస్ : మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్న జనసేన పార్టీ నాయకుడు ఆర్. కళ్యాణ్ కుమార్ పేరు ప్రస్తుతం జెడ్పీటీసీ అభ్యర్థిత్వం కోసం చర్చకు వస్తోంది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ఆయన కృషి చేస్తున్నారు.2021లో గోవిందాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్. కళ్యాణ్ కుమార్, అప్పటి నుంచి జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి విద్యార్థి సంఘాల స్థాయిలో పనిచేస్తూ, మడకశిర మండలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.మండలంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న కళ్యాణ్ కుమార్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని జనసేన పార్టీకి చెందిన నాయకులు కోరుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు కల్పించాలని, ప్రజాసేవకు అవకాశం ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే, జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఆర్. కళ్యాణ్ కుమార్కు అవకాశం లభిస్తుందా లేదా అన్నది పార్టీ అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
మడకశిర ఆర్సీ ఇంచార్జ్ శివరాజు.