BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

సేవా సేతు అభియాన్ పై వినియోగదారులకు అవగాహన

Select Suryaa Now
సేవా సేతు అభియాన్ పై వినియోగదారులకు అవగాహన

 

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  :   మండల కేంద్రమైన ఏఎస్పేట లోని బ్యాంకు సమీపంలో సేవా సేతు అభియాన్ పథకంపై మండల ట్రాన్స్ కో ఏఈ ఏ నిరంజన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుందని పేర్కొన్నారు సోలార్ విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు కోసం బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మొత్తాలు కూడా వారం లోపల లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్నాయని తెలిపారు గరిష్టంగా మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ వ్యవస్థకు 78 వేల రూపాయల వరకు, రెండు కిలోవాట్లకు 60 వేల రూపాయల వరకు, ఒక కిలో వాట్ కు 30 వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుందని వివరించారు అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో తమ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వినియోగదారులకు సోలార్ విద్యుత్ వ్యవస్థల ప్రయోజనాలు, సబ్సిడీ వివరాలు దరఖాస్తు ప్రక్రియ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు కావున మండల ప్రజలు సోలార్ విద్యుత్ పథకంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు