BREAKING
ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ. రైతన్నల సుభిక్షమే లక్ష్యం..వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కూటమి దిశానిర్దేశం

Select Suryaa Now
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కూటమి దిశానిర్దేశం

అమరావతి,సూర్య ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య నివాస ప్రాంగణంలో జరిగిన కీలక భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, సమన్వయంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించినట్లే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి వంద శాతం విజయభేరి మోగించాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల వారీగా బలాబలాలు, మేయర్ మరియు చైర్‌పర్సన్ స్థానాల్లో పోటీ, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సంపూర్ణ సమన్వయం సాధించడంపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు దిశానిర్దేశం చేశారు. కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.