BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు

Select Suryaa Now
గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు

265 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రభుత్వం

మార్కాపురం మేజర్ న్యూస్ 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 265 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా మంగళవారం మార్కాపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం. విజయసునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.వర్చువల్‌ విధానంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ద్వారా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు సైతం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా సాధారణ అనారోగ్యాలకు వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందుల పంపిణీ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులపై పర్యవేక్షణ వంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన సందర్భాల్లో మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులను రిఫర్‌ చేయనున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయసునీత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.