BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ.

Select Suryaa Now
ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ.

సూర్య దర్శి.

మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి సంక్షేమ విప్లవం.

కూటమి తో ఏపీ అభివృద్ధికి పెద్ద పీట.

సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి అందేలా కృషి.

ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా  సేవా సంకల్ప్ అభియాన్

టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని, ఆయన నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం విప్లవంలా పరుగులు తీస్తుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ  జన్మదినం, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను పురస్కరించుకుని 2026 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న " సేవా సంకల్ప్ అభియాన్ " కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీలో  ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామం లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రత్యేక ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ​ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి  మాట్లాడుతూ  ​ప్రధాని నరేంద్ర మోడీ  పాతికేళ్లుగా నిరంతరం ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన నాయకత్వంలో దేశం సంక్షేమం , అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు.  ​కేంద్రంలో నరేంద్ర మోడీ  నాయకత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్లానింగ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ' ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. తూర్పు గంగవరం పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ మౌనిక, డాక్టర్. శ్రీకాంత్, ​మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నాయకులు మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటకరంగం కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, క్లస్టర్ రాచకొండ వెంకట్రావు, మస్తాన్, పిన్నిక రమేష్, వేణు మండలం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.