BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’

Select Suryaa Now
సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’

బాపట్ల, మేజర్ న్యూస్:

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం–సూర్యఘర్‌: ముఫ్త్‌ బిజిలీ యోజన’పై ప్రజలకు అవగాహన కల్పించే ‘సేవా సేతు అభియాన్‌’ పాంప్లెట్‌ను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే అభియాన్‌ లక్ష్యమన్నారు. ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78 వేల వరకు ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. పథకంపై ప్రజలు అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాసరావు, ఏ.ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.