BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం.

Select Suryaa Now
అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం.

సూర్య అద్దంకి.

అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిని డాక్టర్ వాహిలా చౌదరి తెలిపారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలలో భాగంగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాల వద్ద వైద్య శిబిరంతో పాటు రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో సాధారణ వైద్యులు, సర్జన్లు, పీడియాట్రిషియన్లు (పిల్లల వైద్యులు), గైనకాలజిస్టులు, అనెస్థీషియా నిపుణులతో పాటు... ప్రత్యేకంగా డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుడు), ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) వైద్యులు, కంటి వైద్యులు మరియు ఆయుష్ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. యువత, విద్యార్థులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మెగా వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు.