రైతన్నల సుభిక్షమే లక్ష్యం..వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు
త్రిపురాంతకం మేజర్ న్యూస్
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుణ యాగాల్లో భాగంగా మంగళవారం త్రిపురాంతకం మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగం పూజా కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు సమృద్ధిగా అందాలని ఆయన ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలకు సాగునీరు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. రైతన్నల కష్టాలు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని కోరుతూ వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, ప్రకృతి అనుకూల పరిస్థితుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఎరిక్షన్ బాబు ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని సాగునీటి వనరులు నిండితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.