సర్జరీకి ఆర్థిక సాయం
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :;ఇంకొల్లు కు చెందిన వంకాయలపాటి నాగజ్యోతి కు అనారోగ్యం కారణముగా సర్జరీ నిమిత్తం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు మేరకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన యల్.ఓ.సి రు. 1.20 లక్షలు చెక్కును ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు చేతుల మీదుగా నాగజ్యోతి కుటుంబానికి అందచేశారు. కార్యక్రమంలో పర్చూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్ గుంజి వెంకట్రావు, ఇంకొల్లు సొసైటి అధ్యక్షులు కరి శ్రీనివాసరావు, కొణికి సొసైటి అధ్యక్షులు బోడెంపూడి సుబ్బారావు, తదిదతరులు పాల్గొన్నారు.