సమిష్టి కార్యాచరణే లక్ష్యం!
సమిష్టి కార్యాచరణే లక్ష్యం!
“కలిసి అల్పాహారం… కలిసికట్టుగా ప్రజాసేవ!
పరస్పర సమన్వయం, సమాన అవకాశాలు, పారదర్శకత, జవాబుదారీతనంతో నెల్లూరు నగర అభివృద్ధికి సమిష్టిగా ముందుకు సాగుదాం.”
నగర అభివృద్ధి, ప్రజాసేవపై చర్చలు – తరచూ సమీక్షా సమావేశాల నిర్వహణకు నిర్ణయం
— కిషోర్ గునుకుల -జనసేన
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
నెల్లూరు నగరంలోని ఆలయం టిఫిన్ సెంటర్‌లో 45వ డివిజన్ కార్పొరేటర్ చిత్తలూరు సుందర రెడ్డి గారి ఆహ్వానం మేరకు జనసేన కార్పొరేటర్లు, నాయకులు ఆత్మీయ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ చిత్తలూరు సుందర రెడ్డి, 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి, 71వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఆలియా, 15వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కేజీయా కుమారి, 30వ డివిజన్ కార్పొరేటర్ నూనె రుషికేష్ యాదవ్, జనసేన నాయకులు కిషోర్ గునుకుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, కార్పొరేటర్ల మధ్య సమన్వయం, జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజాసేవలో పారదర్శకత, జవాబుదారీతనం, సమాన అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ, క్యాడర్‌ను కలుపుకొని కార్పొరేటర్లందరూ పరస్పర సమన్వయం, ఏకాభిప్రాయంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం చర్చించేందుకు, పనుల పురోగతిని సమీక్షించేందుకు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సమిష్టి కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆత్మీయ సమావేశం కార్పొరేటర్ల మధ్య పరస్పర అవగాహన, స్నేహభావం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది.