రోటరీ ఆధ్వర్యంలో నేత్రదానం
ఇంకొల్లు, మేజర్న్యూస్ :
రోటరీక్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో కోలలపూడి గ్రామంలో నేత్రదానం జరిగింది. గ్రామానికి చెందిన పూనం అన్నపూర్ణమ్మ (88) మృతి చెందగా కుటుంబ సభ్యలు నేత్రదానం చేసేందుకు ముందుకువచ్చారు. దాత కుటుంబ సభ్యులు గుంటూరు ఇంకొల్లు రోటరీ అవయవదాన కమిటికి సమాచారం అందించారు. అవయవదాన కమిటి ప్రతినిధులు సోమేపల్లి రామ్మోహన్రావు, జెట్టి వెంకటేశ్వర్లు గుంటూరు శంకర కంటి వైద్యశాలకు సమాచారం అందించారు. శంకర నేత్రాలయ వైద్యులు కోలలపూడి వచ్చి దాత కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేసినందుకు దాత కుటుంబ సభ్యులు పూనం వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ, కనుమూరి మురళి, శారద, యర్రమాసులను రోటరీ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.