రూ.33 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణ పురపాలక సంఘం పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద మంజూరు చేసిన రూ.33 కోట్ల నిధులతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని 12వ, 14వ, 23వ, 32వ, 33వ వార్డుల్లో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలో రహదారుల అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల రాకపోకలకు సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,