రూ. 50 వేలు దాటితే క్యాష్ సీజ్.
అద్దంకి మున్సిపల్ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలు, భద్రత ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు మరో ముగ్గురు మాత్రమే కేంద్రంలోకి అనుమతించబడతారని, వేరే ఎవరినీ లోపలికి రానివ్వబోమని డిఎస్పి స్పష్టం చేశారు