రిటైర్డు యంపిడిఓ ను సన్మానించిన ఎమ్మెల్యే.
కొత్తూరు సెప్టెంబర్ 30(మేజర్ న్యూస్) : కొత్తూరు ఇంచార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి ఆగస్టు 31పదవీ విరమణ చేసిన బివియస్ ప్రసాదరావు (రాంబాబు)ను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శాలువ కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే గోవిందరావు స్వయంగా పారాపురం యంపిడిఓ రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని సన్మానించడం విశేషం. పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోవిందరావు ను ఆహ్వానించగా
కొన్ని అనివార్యకారణాల వలన ఎమ్మెల్యే హాజరు కాలేకపోయారు.అధికారులతో ఎమ్మెల్యే కు ఉన్న తత్సంబంధాలు వలన ఆయన రాంబాబు ఇంటికి వెళ్లడం విశేషం. ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చి సన్మానం చేసినందుకు ఎమ్మెల్యే కు రాంబాబు దంపతులు ధన్యవాదములు తెలియ జేశారు. ఆయన వెంట తెలుగుదేశం సీనియర్ నేత మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు లోతుగెడ్డ తులసీ వర ప్రసాదరావు, సామాజిక వేత్త ఎంపిహెచ్ డవలపర్స్ అధినేత బామిడి రాజు , ధనుంజయ రావు,నిమ్మగడ్డ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.