రిజర్వేషన్ కి ప్రాతిపదిక ఎక్కడ?
ఇరగవరం సూర్య న్యూస్:ఎస్సీ.15శాతం, ఎస్.టీ. 6శాతం మొత్తం 50శాతం మించని విధంగా బీసీ రిజర్వేషన్లు బాగున్నది. అమలులో ప్రభుత్వ నిర్ణయం బాగుందా? అంటే అనుమానస్పదం. లెక్క తప్పింది అనడంలో అతిశయోక్తి కాదు అన్నమంతా పట్టి చూడక్కర్లేదు ఒక్క మెతుకు చల్లన్నట్లుంది ఈ వ్యవస్థ. ఉదాహరణకు మండలంలోని కత్తవపాడు గ్రామాన్ని పరిశీలిద్దాం 1995లో పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కత్తవపాడు గ్రామానికిఅటు ఇటు పొదలాడ, కంతేరు గ్రామాలు ఎస్సీ రిజర్వేషన్ క్రిందికి వచ్చాయి మధ్యనున్న కత్తవపాడు బీసీ మహిళ అయ్యింది ఇప్పుడు కంతేరు మాత్రం ఎస్సీ, పొదలాద బీసీ అయ్యింది. మరి కత్తవపాడు ఎస్సీ అయ్యింది ఇది ఎలా సాధ్యం? పాత పద్దతి ప్రకారం కత్తవపాడు గ్రామం 2001లో ఎస్సీ అయ్యింది మండలంలో 21గ్రామాలు అందులో 4గ్రామాలు,2007లో 4గ్రామాలు,2013లో 4గ్రామాలు, 2021లో 4గ్రామాలు, 2026లో 4గ్రామాలు అంటే 20గ్రామాలు పోను ఒక గ్రామం మిగిలి ఉంది ఈ ప్రకారం క్రమం తప్పకుండ ఎన్నిక జరిగింది మరి 2031లో కత్తవపాడు ఎస్సీ అవ్వాలి అధికారులు ఏలెక్క ప్రకారం చేసారో కానీ ఇప్పుడే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఇది ఎలా సాధ్యం.
అలాకాకుండా 2021ప్రకారం ఇరగవరం మండలంలోని ఎస్సీ రిజర్వేషన్ చూస్తే. రిజర్వేషన్ అవరోహన క్రమంలో చూడాలి కానీ క్రమం తప్పిన విధంగా చూస్తే 2021లో 1)ఇరగవరం 15శాతం, 2)రేలంగి 18శాతం, 3)కావలిపురం 19శాతం, 4)కాకిలేరు 31శాతం,2026లో రాపాక 22శాతం, కత్తవపాడు 26శాతం,కంతేరు 28శాతం, ఓగిడి 42శాతం,ఉంది మిగిలివున్నా పొదలాద ఎస్సీ శాతం ఎక్కువ కె. కుముదవల్లి ఎస్సీ ఎక్కువ అయినా రిజర్వేషన్ ఇలా వచ్చాయంటే ఎలా అర్ధం చేసుకోవాలి. దీనిపై అధికారులు ఏమి చేస్తున్నట్లో అర్ధం కావటం లేదు.
దాయం దొరబాబు, ఇరగవరం రిపోర్టర్, పశ్చిమ గోదావరి జిల్లా