BREAKING
పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
 
 
అవనిగడ్డ, మేజర్ న్యూస్ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అవనిగడ్డ మండల రేషన్ డీలర్లు మంగళవారం తహసీల్దార్ అంకాలుకు వినతిపత్రం సమర్పించారు. డివి లీలా మాధవ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డీలర్లకు నెలకు కనీసం రూ.5 వేల కమిషన్ కూడా రావడం లేదని, కమిషన్ పెంచాలని కోరారు. డోర్ డెలివరీ ఖర్చులు చెల్లించాలని, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరుకులను సరైన తూకంతో అందించాలని విజ్ఞప్తి చేశారు. డీలర్ల సంక్షేమ నిధికి కమిషన్ మళ్లించడం, డీలర్ మరణిస్తే అంత్యక్రియల ఖర్చుల కింద రూ.15 వేలు చెల్లిస్తామన్న హామీలను అమలు చేయాలని కోరారు. రేషన్ పంపిణీలో నెట్‌వర్క్, సర్వర్, గన్నీ బ్యాగుల స్కానింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు చెన్ను నాగేంద్రం, కార్యదర్శి ధరావతు శ్రీను, సింహాద్రి శ్రీరామ్, శీలం శ్రీను, కూర్చేటి సురేంద్ర, నాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.