రెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాంప్రసాద్ దంపతులు
లక్క వరపు, సూర్య : స్థానిక శ్రీ సీతారామస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రీ వేంకటేశ్వర దివ్యోత్సవాలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజుఅమ్మ వారు గాయత్రి దేవి అవతారం లో పూజలు అందుకున్నారు సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆమె భర్త కోళ్ల బాలాజీ రాంప్రసాదు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు అక్కా జోస్యుల శ్రీహరిశర్మ ఆధ్వర్యంలో జరిగిన సుప్రభాత సేవ, నాదస్వరం, పంచాయతన దేవతాభిషేకం, అర్చన, విశేష హోమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సప్తదిన శ్రీ వేంకటేశ్వర వ్రతం కార్యక్రమంలో భక్తులతో కలిసి పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి,అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలలో స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవి గురు బృందం,ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వైదిక ప్రముఖులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట, విజయనగరం జిల్లా.