రక్తదానంతో కొండంత అండ: ఆర్డీవో
చీపురుపల్లి మేజర్ న్యూస్: రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా ఉంటుందని ఆర్డీవో ఎం సుధారాణి పేర్కొన్నారు. స్థానిక ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం విజయనగరం రెడ్ క్రాస్ వారి సహకారంతో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 32 మంది రక్తదానం చేయగా కాలేజీ విద్యార్థులు మొత్తం 250 మందికి బ్లడ్ గ్రూపింగ్ చేయడమైనది. ఈ శిబిరాన్ని ఆర్డీవో ఎం సుధారాణి ప్రారంభించగా వారి సిబ్బంది కూడా రక్తదానం చేసినారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్, చీపురుపల్లి డివిజన్ ఇంచార్జ్ బివి గోవిందరాజులు, కళాశాల ప్రిన్సిపాల్ రామునాయుడు, వజ్రపు సంతోషి, రెడ్ క్రాస్ పి ఆర్ ఓ పోతుల దుర్గాప్రసాద్, పి ప్రసన్న కుమార్, డి. ర్. ప్రసాద్ రావు, మీసాల కృష్ణమూర్తి, రాజు పాల్గొన్నారు