BREAKING
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రైతులు ఆక్వా సాగులో సాంకేతికను అందిపుచ్చుకోవాలి ఆక్వా ఎక్స్ పోను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ

Select Suryaa Now
రైతులు ఆక్వా సాగులో సాంకేతికను అందిపుచ్చుకోవాలి  ఆక్వా ఎక్స్ పోను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ

ఉండి, సూర్యన్యూస్: ఆక్వా ఎగ్జిబిషన్ల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఉత్పత్తులపై అవగాహన పొందడంతో పాటు సాగులో ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరం  రాధాకృష్ణ కన్వర్షన్ హాల్‌లో దంతులూరి వేణు ఆధ్వర్యంలో మూడు రోజులు జరగనున్న ఆక్వా ఎక్స్ పోను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు ప్రధాన జీవనాధారంగా ఉందని, వేలాది మంది రైతులు రొయ్యలు, చేపల సాగుపై చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. ఆక్వా రంగంలో నిరంతరం కొత్త సాంకేతికత, నూతన పరికరాలు, అధునాతన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వాటి గురించి రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్‌లో రైతులకు అవసరమైన వివిధ రకాల ఆక్వా ఉత్పత్తులు, హేచరీలు, ఏరియేటర్లు, జనరేటర్లు, ఆక్వా మేతతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నేరుగా స్టాల్స్‌ను సందర్శించి తమకు ఎదురవుతున్న సమస్యలను నిపుణులతో చర్చించి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చన్నారు.  ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడం ద్వారా సాగులో అనవసర వ్యయాలను నియంత్రించుకోవచ్చన్నారు. అదే సమయంలో రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యతను పెంచి మంచి దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఆక్వా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు కూడా తమ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. కేవలం సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.మూడు రోజులపాటు జరిగే ఈ ఆక్వా ఎక్స్ ఎగ్జిబిషన్‌ను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసేను రాజు పాల్గొని వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రారంభించారు.  ఆక్వా రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 రిపోర్టర్ రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా