BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

రావివలసలో అంగన్వాడీ వర్కర్లకు ఘన సత్కారం

Select Suryaa Now
రావివలసలో అంగన్వాడీ వర్కర్లకు ఘన సత్కారం

 

అంగన్వాడీ వర్కర్ లు మంగమ్మ, పార్వతిలకు సన్మానం

ఐసిడిఎస్ పి ఓ గొట్టాపు సుగుణ కుమారి,సూపర్వైజర్ రౌతు లక్ష్మీ

గరుగుబిల్లి, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్:గర్భిణులు, బాలింతలు మరి యు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పోషణ్ మా" (జాతీయ పోషణ మాసం) కార్యక్ర మంతో పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రావివలస గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్ లు మంగమ్మ, పార్వతిలను చిన్నారుల తల్లిదండ్రుల తో పాటు పలువురు లబ్ధిదారులు బుధవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ లు మంగమ్మ,పార్వతిలకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.అదే విధము గా సేవా సంకల్ప అభియాన్ కార్యక్ర మంలో భాగంగా కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణ కుమారి,గరుగుబిల్లి సెక్టార్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రౌతు లక్ష్మీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గొట్టాపు సుగుణకుమారి మాట్లాడుతూ పోషకా హార లోపాన్ని నిర్మూలించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు.నెల రోజుల ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించేం దుకు వారు చేసిన కృషి అభినందనీ యమన్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపు 
పోషణ్ మా ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరి చిన అంగన్‌ వాడీ కార్యకర్తలను అధికారు లు మరియు ప్రజాప్రతినిధులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించ డం జరుగుతుందన్నారు.పోషణ్ మాసోత్సవాలలో అంగన్‌వాడీ కార్య కర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన 9వ రాష్ట్రీయ పోషణ్ మాస్ (జాతీయ పోష కాహార మాసం - 2026) ఉత్సవాల్లో భాగంగా, క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ తరఫున సన్మా నించడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని 'సుపోషిత్ భారత్' (పోషకా హార లోపం లేని భారతదేశం)గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పోషణ్ అభియాన్ కొన సాగుతోందని పేర్కొ న్నారు.గరుగుబిల్లి సెక్టార్ సూపర్వైజర్ రౌతు లక్ష్మి మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం శ్రమిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలే నిజమైన క్షేత్రస్థాయి యోధులని పేర్కొన్నారు.సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని, అందుకే కేంద్ర ప్రభుత్వం 'సేవా సంకల్ప్ అభియాన్' ద్వారా తగిన గుర్తింపు ఇస్తోందని తెలి పారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల తల్లిదం డ్రులు తదితరులు పాల్గొన్నారు.