రాష్ట్రస్థాయి పోటీలకు చందలూరు విద్యార్థులు .
దర్శి మేజర్ న్యూస్. చంబలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన హ్యాండ్ బాల్, టైక్వాండో, ఉషు పోటీల్లో దర్శి మండలం చందలూరు పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు డి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. హ్యాండ్ బాల్ నందు ఎం. సలోమన్ ,కె.హరిశ్రీదేవి ఎస్. నవీన్ ఎంపిక కాగా ఈనెల 10వ తేదీ నుంచి తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.