రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు.
ముండ్లమూరు మండలంలోని మారెళ్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. మద్దిపాడు మండలం తెల్లపాడులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఎంపికల్లో వై.అర్జున్, పి.ప్రవళిక అండర్-19కె.అరుణ అండర్-17 ,జె.అంజిబాబు, జి.లాస్య అండర్-14 ఎంపికయ్యారు. హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, పీడీ పద్మలత, కమిటీ చైర్మన్ ఎస్.కె.జాన్ సైదా, మాజీ చైర్మన్ పూరిమెట్ల యల్లయ్య అభినందించారు.