రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గొలగమూడి గురుకుల విద్యార్థిని ఎంపిక
వెంకటాచలం, మేజర్ న్యూస్ : నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్-14 కబడ్డీ పోటీల్లో గొలగమూడి మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వై. ఆరాధ్య ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్, ప్రిన్సిపల్ వి.వి. రమణ ప్రసాద్, పీఈటీ సుష్మిత, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరాధ్యను అభినందించారు.