BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి చేసిన ఎమ్మెల్యే అరిమిల్లి

Select Suryaa Now
రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి చేసిన ఎమ్మెల్యే అరిమిల్లి

ఇరగవరం సూర్య న్యూస్ :కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రైతుల భూమిపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మంగళవారం 2840 పట్టాదారు పాసుపుస్తకాలు  పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత చిత్రాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు రైతులకు ఎంతో విలువైనవని, అటువంటి భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలపై వ్యక్తిగత రాజకీయ నాయకుల చిత్రాలు ముద్రించడం సరికాదన్నారు. గతంలో రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చే విధానం ఉండేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్రంతో పాటు పార్టీ రంగులతో పాస్ పుస్తకాలు అందించారని విమర్శించారు.*భూమిపై హక్కులు రైతులకే ఉండాలి*గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణంగా భూములపై రైతుల హక్కులకు సంబంధించి ఆందోళనలు నెలకొన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేసి రైతుల భూములపై వారికి హక్కులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో పాటు రైతుల ఫొటో ఉంటుందని తెలిపారు. భూమికి సంబంధించిన వివరాలతో పాటు మ్యాప్ కూడా పాస్ పుస్తకంలో పొందుపరుస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్ ద్వారా భూమి లొకేషన్‌ను తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నారని చెప్పారు. దీనివల్ల రైతులు తమ భూమి ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలతో పాటు పొలాల సరిహద్దు రాళ్లపై కూడా అప్పటి ముఖ్యమంత్రి చిత్రాలు ఏర్పాటు చేశారని ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. రైతుల పొలాల్లోని సరిహద్దు రాళ్లపై రాజకీయ నాయకుల చిత్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇటువంటి విధానాలకు స్వస్తి పలికి, రైతులకు ఉపయోగపడే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.2027 నాటికి ప్రతి రైతుకూ పాస్ పుస్తకం 2027 నాటికి రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా 9వ తేదీన నిర్వహించే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పాస్ పుస్తకాలు సిద్ధమైన ప్రాంతాలకు తాను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వెళ్లి రైతులకు వాటిని అందజేస్తున్నామని తెలిపారు. రైతుల భూముల సరిహద్దులు స్పష్టంగా ఉండేలా, భూమికి సంబంధించిన హక్కుల విషయంలో వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. రైతాంగానికి గతంలో ఎదురైన సమస్యలను గుర్తించి, వారి ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతుల భూములకు సంబంధించిన రికార్డుల విషయంలో పారదర్శకత పెంచడం, పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా హక్కులకు భరోసా కల్పించడం, భూముల వివరాలను సులభంగా తెలుసుకునే సదుపాయాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దాయం దొరబాబు, రిపోర్టర్ ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా