రాజగోపాల్ నాయుడు మృతికి ఎమ్మెల్యే గురజాల సంతాపం
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని నరిగపల్లి 16వ వార్డు తెదేపా అధ్యక్షుడు రవి నాయుడు తండ్రి రాజగోపాల్ నాయుడు మృతికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంతాపం తెలిపారు.
శనివారం నరిగపల్లిలో రాజగోపాల్ నాయుడు మృతదేహానికి స్థానిక కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు మృతి కుటుంబానికి, గ్రామానికి తీరని లోటు అని తెలిపారు. రవి నాయుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్