రాచూరిపెద్దమ్మతల్లికి అన్నపూర్ణదేవి అలంకరణ:
సిఎస్ పురం,మేజర్ న్యూస్ : విజయదశమి పండుగ సందర్భంగా సిఎస్ పురంలోని వి.ఆర్.నగర్ నందు వెలసిన శ్రీరాచూరి పెద్దమ్మతల్లి దేవస్థానం నందు మూడవరోజు మంగళవారం అమ్మవారిని కాశీఅన్నపూర్ణ అలంకరణ చేసి అ పూజలు నిర్వహించారు.దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు దేవస్థానం అర్చకులు గురుచెన్నకేశవచార్యులు అధ్వర్యంలో విశేషపూజలు హోమాలు నిర్వహించి వైభవంగా ప్రారంభించి పెద్దమ్మతల్లిని అన్నపూర్ణదేవి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.మూడవరోజు మంగళవారం ఉదయం పెద్దమ్మతల్లి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో అన్నపూర్ణదేవి అలంకరణ చేసి కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పెద్దమ్మతల్లిని దర్శించుకుని పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా పెద్దమ్మతల్లి దేవస్థానం నందు అమ్మవారిని విశేష అలంకరణ చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు.