పురమిత్ర యాప్ ను వినియోగించండి - కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను నేరుగా నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వివిధ మున్సిపల్ పన్నులు, చార్జీలను సులభంగా చెల్లించేందుకు పురమిత్ర యాప్ ను వినియోగించుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
మీ సమస్యలను తెలియజేయండి – మీ పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించండి – మెరుగైన పౌర సేవలను పొందండి అని కమిషనర్ పిలుపునిచ్చారు.
పురమిత్ర యాప్ ద్వారా వివిధ సేవలను ఆయన వివరించారు.
ఫిర్యాదుల నమోదు
ఈ యాప్ ద్వారా నమోదు చేయవచ్చు అని,ఆన్‌లైన్ చెల్లింపులు
పురమిత్ర యాప్ ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు అని,
ఆస్తి పన్ను చెల్లింపు
నీటి ఛార్జీలు చెల్లింపులు,
ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వివరాలు, ఫోటోలతో యాప్‌లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు అని,సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు.
అలాగే మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే పన్నులు, ఇతర ఛార్జీలను చెల్లించుకోవచ్చని తెలిపారు.