పులకుర్తి రంగయ్య దేవస్థానానికి రూ.1.01 లక్షల విరాళం
హీరేహాళ్ : మండలంలోని పులకుర్తి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎ.నే. రంగయ్య దేవస్థానానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు, హీరేహాళ్ మండల యూత్ అధ్యక్షుడు హెచ్.కె. హనుమంత్ రెడ్డి రూ.1,01,000 (ఒక లక్షా వెయ్యి రూపాయలు) విరాళంగా అందించారు.
దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో హనుమంత్ రెడ్డి ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు హెచ్.కె. హనుమంత్ రెడ్డిని పూలమాలలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించిన ఆయనను పలువురు అభినందించారు.
రిపోర్టర్ : శివకుమార్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం