ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్‌కు శ్రీకారం ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్రవ్యాప్తంగా రూ.30,156 కోట్లతో చేపడుతున్న జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అహుడా చైర్మన్ టీసీ వరుణ్ ఘన స్వాగతం పలికారు. వరుణ్‌ను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని టీసీ వరుణ్ అన్నారు.
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)