BREAKING
వృద్ధుల హక్కులను కాపాడటం మన బాధ్యత కాపీరైట్ వివాదంలో సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు ఊహించని ఎదురుదెబ్బ.. కోర్టులో కీలక తీర్పు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుండి నడిపిస్తా పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి -యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ళ పవన్ కుమార్ ఆస్ట్రేలియా మేయర్‌గా తెలంగాణ ఆడబిడ్డ...! మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట నోటీసులు అందుకున్న ఓటర్ల వద్దకే బిఎల్ఓలు.. సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు అప్స డెమొక్రటిక్ డివిజన్ అధ్యక్షురాలుగా పోలిశెట్టి కనకదుర్గ భవాని రేపే ‘సిగ్మా’ సినిమా విడుదల.. పైరసీ చేసేవారికి హీరో సందీప్ కిషన్ గట్టి వార్నింగ్ బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటీటీ హడావుడి.. డిజిటల్ రైట్స్ కోసమే సినిమాలు చేస్తున్నారా? పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు మార్గం సుగమం.. ఉప సర్పంచ్‌ల జాప్యంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

ప్రొద్దుటూరు మున్సిపల్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి,కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా

Select Suryaa Now
ప్రొద్దుటూరు మున్సిపల్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి,కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : పట్టణంలోని మున్సిపల్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, పట్టణ సుందరీకరణకు తగిన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ & మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీమతి నిధి మీనా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని ఆమె కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తో కలిసి పరిశీలించారు. స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి పచ్చదనంతో సుందరీకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే మున్సిపల్ స్థలాలకు హద్దులు గుర్తించి, ఆక్రమణలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూచిస్తూ ఈ విషయంలో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ ను జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆదేశించారు