BREAKING
గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి! గజపతినగరంలో రోగులు బాధలు సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణాపురం గ్రామ దంపతులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు హేమశ్రీ ఎంపిక వైసీపీకి 30వ వార్డు అభ్యర్థి దంపతుల రాజీనామా అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్థానిక పోరులో అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే స్థానిక సమరానికి ఫలితాల వేళ! విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సర్వసిద్ధం ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి * సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వినతి కల్వకోల్‌లో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి సెగలు* 17ఏళ్ల దేశసేవకు ఘన సత్కారం

ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలి

Select Suryaa Now
ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలి

గాజువాక, సూర్య :  ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందుబాటులో ఉండాలని, న్యాయం పొందడం అందరి హక్కని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గాజువాక కోర్టు సముదాయంలో 13వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి ఎస్.ఎం. ఫణికుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కోర్టు సముదాయం నుంచి 100 అడుగుల రోడ్డు సిగ్నల్ వరకు భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి జాతీయ న్యాయ సేవా దినోత్సవ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించే విధానాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి ఎస్. కవిత, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) డి. గీతారాణి, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మరియు 9వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సంగవరపు సూర్యకిరణ్ శ్రీ, విశాఖ సిటీ సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ చింతా వాసునాయుడు, దువ్వాడ సీఐ నమ్మి గణేష్, గాజువాక ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ షేక్ హుస్సేన్, పలువురు న్యాయవాదులు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.