ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
-28 వార్డుల్లో 75.17 శాతం పోలింగ్ నమోదు
ఆమదాలవలస, నవంబర్ 26, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలు గురువారం నిర్వహించడంతో పోలింగ్ శాతం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో 28 వార్డులు ఉండగా 33067 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో 24858 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం 75.17 శాతం పోలింగ్ నమోదు అయింది. 28 వార్డుల్లో 44 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ ల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు కొన్ని కేంద్రాల్లో పోలింగ్ నమోదు అయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ పూర్తి కాబడింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.