BREAKING
ఎం.రాజపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే జయకృష్ణ బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి గుడిపల్లిలో 80.75 శాతం పోలింగ్ నమోదు సూర్య, జ్యోతిక ప్రేమ కథపై నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు: అన్యోన్యతకు అసలైన అర్థం వారేనంటూ ప్రశంసలు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్....

ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణపై కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ హర్షం

Select Suryaa Now
ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణపై కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ హర్షం

నరసన్నపేట,  సూర్య : మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్ గురువారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను గమనించి, ఓటర్లు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు కృషి చేసిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజలు పరస్పర సామరస్యంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అభినందనీయమని, నరసన్నపేట మండలంలో పోలింగ్ నిర్వహణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటరు నాడి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో నరసన్నపేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.