ప్రజా దర్బార్ నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
ఉండి, మేజర్ న్యూస్:ఉండి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉండి ఎమ్మెల్యే, పిటి స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో పెదమిరం పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ ఘనంగా నిర్వహించారు.ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఈతకోట రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా