ప్రధాని మోడీ పేరు మీద రుద్రాభిషేకం
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ : ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా నేటికీ 25 సంవత్సరాల సూపరి పాలన జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశ రక్షణ కోసం దేశ ఔన్నత్యాన్ని పెంచడం కోసం ధర్మ పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీకి మరింత నూతన శక్తిని, ఆయుషు. ఆరోగ్యం ప్రసాదించాలని నెల్లూరు మూలపేట బిజెపి కార్యకర్తలు రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరు. అనురాధ నక్షత్రం. వృశ్చిక రాశి. కాశ్యప గోత్రం పేరు మీద బ్రహ్మసూక్త శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు సాయి స్వామితో కలిసి బిజెపి ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ నాగఫణి శర్మ రుద్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు మిడతల రమేష్ మహాలక్ష్మి దంపతులు. అల్లూరి నాగేంద్ర సింగ్. చిత్తూరు పద్మావతి. టి శ్రీనివాసులు. చిట్టిబాబు. నవీన్ శెట్టి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు