BREAKING
వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి 'జైలర్ 2'లో నటించడానికి మిథున్ చక్రవర్తి పెట్టిన విచిత్రమైన షరతు.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం కుందుర్పి సూర్యప్రతినిధి- అన్నపూర్ణ అవతారంలో కుందుర్పమ్మ దర్శనం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద మాజీ మావోయిస్టు కుటుంబానికి గృహ వసతి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద మాజీ మావోయిస్టు కుటుంబానికి గృహ వసతి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సూర్య, నంద్యాల బ్యూరో:జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు బోయ కృష్ణవేణికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 2.0 పథకం కింద ఇల్లు మంజూరైంది. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్‌లో నిర్మించిన ఆమె నూతన గృహాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ద్వారా గృహ వసతి కల్పిస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సొంత ఇళ్లు లేని అర్హులైన కుటుంబాలకు సురక్షితమైన నివాస సదుపాయం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీడీ శ్రీహరి గోపాల్, డీఈ విజయ్ బాబు, ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ తదితర అధికారులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*