ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి.
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. మాజీ ఎమ్మెల్యే యానాది రెడ్డికి ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన ఆయన, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో బరిలోకి దిగి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు మున్సిపాలిటీలోని మొత్తం 44 వార్డుల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను 'ఫ్యాన్' గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరుతున్నారు.