BREAKING
అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం పనుకువలస నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషకు ఎమ్మెల్యే విజయచంద్ర అభినందనలు అదాలత్ సెంటర్ వద్ద రోడ్డు గుంతల పూడ్చివేత ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి అంగన్వాడీ కార్యకర్తలకు మొమోలు..

పూజ పేరుతో బంగారం అపహరణ

Select Suryaa Now
పూజ పేరుతో బంగారం అపహరణ

పెదవేగి మేజర్ న్యూస్ :పూజలు చేసి ఆరోగ్య సమస్యలు తొలగిస్తామని నమ్మించి ఓ వృద్ధురాలి బంగారు చెవిదిద్దును దొంగిలించారు.

బుధవారం ఉదయం కొందరు భవానీమాలధారులు అన్నదానం కోసం చందాలు సేకరిస్తూ పెదవేగి గ్రామంలో ఇంటింటికీ వెళ్లారు.

ఈ క్రమంలో కాసాని అలివేలమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి, ఆమె భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనిపై చేతబడి జరిగిందని చెప్పారు.

పూజ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మించారు. దీంతో భయపడిన వృద్ధురాలు పూజ కోసం తన బంగారు చెవిదిద్దులను ఇచ్చింది.

పూజ చేస్తున్నట్లు నటించిన వ్యక్తి, పూజ పూర్తయిన తర్వాత ఒక చెవిదిద్దును తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.

దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ ఎన్. లక్ష్మీనారాయణ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు నంబర్ ప్లేట్లు లేని రెండు ద్విచక్రవాహనాలపై వచ్చినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.