పొన్నూరులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
పొన్నూరు మేజర్ న్యూస్ :- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొన్నూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల్లో భద్రతా భావం కల్పించేందుకు పోలీసులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్