BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

పోలీసుల కార్డన్ సెర్చ్ - 20 ద్విచక్ర వాహనాల స్వాధీనం

Select Suryaa Now
పోలీసుల కార్డన్ సెర్చ్ - 20 ద్విచక్ర వాహనాల స్వాధీనం

అనుమానితులకు డ్రగ్స్ రాపిడ్ టెస్టులు

దొనకొండ మేజర్ న్యూస్ :--- దొనకొండ పట్టణంలో పోలీసులు మాదకద్రవ్యాల నియంత్రణ నేరాల నివారణ లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఐ ఎల్. రామకృష్ణ ఆధ్వర్యంలో వీవీపురం కాలనీలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత వాటిని అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం

స్థానిక బస్టాండ్ సెంటర్లో అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ రాపిడ్ టెస్టులు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం విక్రయం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ రామకృష్ణ ప్రజలకు సూచించారు. దొనకొండ మండలాన్ని మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.