పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
*ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపిక కాబడిన SCTPC అనంతపురంలో 127 మంది పురుష అభ్యర్థులు విజయనగరం పిటిసి నందు 57 మంది మహిళ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు ఏలూరు జిల్లా లో రిపోర్ట్ చేసినారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వులు మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై ప్రసాద్ రావు యొక్క సమాచార దీపిక పంపిణీ చేసినారు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి వెళ్లనున్న పోలీసు సిబ్బందికి సమాచార దీపికలను పంపిణీ చేశారు.ఈ సమాచార దీపిక లో పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం పొందుపరచబడింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు, రివార్డులు, సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రత, భద్రతా పథకాలు, పోలీసు సంక్షేమానికి సంబంధించిన అంశాలు తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు.కొత్తగా విధుల్లోకి ప్రవేశిస్తున్న పోలీసు సిబ్బందికి ఈ సమాచార దీపిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై ప్రసాద్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెదవేగి డి టి సి ఇన్స్పెక్టర్ శ్రీ రామా రావు డి డి ప్రసాద్ పోలీసు అధికారులు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.